నూతన గృహ భూమి పూజలో పాల్గొన్న కౌన్సిలర్లు

పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలో నూతన గృహ భూమి పూజ కార్యక్రమంలో కౌన్సిలర్లు పాల్గొన్నారు. పరకాల పట్టణంలోని 12వ వార్డు పరిధిలో కళాకారుడు, గాయకుడు బండి సమ్మయ్య నూతన గృహ భూమి పూజ కార్యక్రమంలో పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, పరకాల మున్సిపాలిటీ 19వ వార్డు కౌన్సిలర్ కొయ్యడ శ్రీనివాస్, 21వ వార్డు కౌన్సిలర్ సుధమల్ల రమేష్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సమ్మయ్య కౌన్సిలర్లను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు ఒంటేరు శ్రావణ్ కుమార్. కాంగ్రెస్ పార్టీ నాయకులు చందుపట్ల రఘు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply