పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించిన కౌన్సిలర్

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని 9వ వార్డులో పారిశుద్ధ్య పనులను కౌన్సిలర్ పస్తం ఆంజనేయులు గురువారం పర్యవేక్షించారు. వార్డు పరిధిలో పారిశుద్ధ్య పరిస్థితులు ఎప్పుడికప్పుడు మెరుపుగా ఉండేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. వార్డు ప్రజలంతా తమకు సంపూర్ణ సహకారాన్ని అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
