Councillor |పోస్ట్ చేసిన క్షణాల్లోనే పరిష్కారం..

Councillor |పోస్ట్ చేసిన క్షణాల్లోనే పరిష్కారం..
వెంటనే చొరవ తీసుకున్న చల్లా రమ్య రఘురెడ్డి
కాలనీ వాసుల కృతజ్ఞతలు వెల్లువ
Councillor | స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ: ప్రజలు నమ్మి ఎన్నుకున్న నాయకురాలు ఎలా ఉండాలో స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ 5వ వార్డు కౌన్సిలర్ చల్లా రమ్య రఘు రెడ్డి చూపించారు. పాలకుర్తి రోడ్డు పరిధి లోని కాలనీలో నీటి సమస్యతో భాద పడుతున్నామని కాలనీ వాసులు వార్డు వాట్సాప్ గ్రూప్‌లో ఈ సమస్యను పోస్ట్ చేశారు. కాలనీలో నీరు రావడం లేదని పెట్టిన సందేశం చూసిన క్షణం నుంచే కౌన్సిలర్ స్పందిం చారు. ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా మున్సిపల్ అధికా రులతో మాట్లాడి సిబ్బందిని వెంటనే సంఘటన స్థలానికి పంపించారు.
తక్షణమే మరమ్మత్తులు చేయించి కొద్దిసేపట్లోనే కాలనీలో మళ్లీ నీటి సమస్యను పూర్తి చేశారు. ఇంత త్వరగా స్పందించిన మా కౌన్సిలర్ కు హృదయపూర్వక ధన్యవాదాలు అని కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలి పారు. ప్రజల పిలుపు వినగానే స్పందించడం…సమస్యను వెంటనే పరి ష్కరించడం… అదే నిజమైన ప్రజాసేవ అని పలువురు కొనియాడారు.


