ప్రశాంతంగా చివరి కౌన్సిల్ సమావేశం

ప్రశాంతంగా చివరి కౌన్సిల్ సమావేశం
- విజయవాడ నగర అభివృద్ధి కోసం కృషి చేశాం
- కౌన్సిల్ సమావేశం లో మేయర్ రాయన భాగ్య లక్ష్మి
- ఉద్యోగుల జీత,భత్యాలు,ప్రమోషన్ల ఆమోదం
- మంచి నీరు సరఫరా, పార్కుల అభివృద్ధి పై పలు తీర్మానాలు ఆమోదం
విజయవాడ కార్పోరేషన్,ఆంధ్ర ప్రభ : విజయవాడ నగరాన్ని సమగ్రహంగా అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశామని మేయర్ రాయన భాగ్య లక్ష్మి అన్నారు. గత ఐదు సంవత్సరాలుగా నగర ప్రజలకు మెరుగైన జీవనము అన్ని మౌళిక వసతులు కల్పిస్తూ నగరాన్ని ప్రణాళిక రూపొందించి సుందరీకరంగా తీర్చి దిద్దటం జరిగింది అన్నారు. గత ఐదు సంవత్సరాలుగా సహరించిన అధికారులకు ,సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేషేరు. విజయవాడ నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయం లోనీ కౌన్సిల్ హాల్ లో బుధవారం ఉదయం సర్వ సభ్య సమావేశం జరిగింది.
ఈ సమావేశం మొత్తం 149 అంశాలు చర్చకు వచ్చాయి.118 అంశాలను ఆమోదించారు.24 అంశాలు రీమార్కులు చేశారు.3 అంశాలు రాష్ట ప్రభుత్వం నకు సిఫార్సు చేయడం జరిగింది. తొలుత ప్రశ్నోత్తరాల పై చర్చజరిగింది.చర్చల్లో నగర ప్రజల కు సంబంధించిన మంచినీటి సరఫరా నీటి ట్యాంకుల శుభ్రత పై చర్చజరిగింది.నగరం లో 15 మంచినీటి ట్యాంకులు ఉన్నాయి వాటిని శుభ్రం చేయాలని అధికారులు సరైన దృష్టి పెట్టక పోవటం తో నీరు కలుషితం అయి డయేరియా లాంటి వ్యాధులు వస్తున్నాయి అని కొండ ప్రాంతంలో మంచినీటి సరఫరా తీవ్రంగా ఉందినీ అధికారులు నిర్లక్షం చేస్తున్నారని అధికారుల పై సభ్యులు మండి పడ్డారూ.చనిపోయిన అఫ్కాస్ ఉద్యగుల స్థానంలో వారి కుటుంబ సభ్యుల కు మాత్రమే అవకాశం కల్పించాలి అధికారులను సభ్యులు కోరారు.
కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ రెండు సంవత్సరాల కాలం లో నగరం పరిధిలో కొత్త గా పెన్షన్లు ఇవ్వలేదని ఎవరైనా చనిపోతే వారి స్థానం లో కొత్తగా పెన్షన్లు మంజూరు చేస్తున్నారని,కొత్త నగరం లో 1788 మాత్రమే మంజూరు చేశారని కార్పొరేటర్లు తమ ఆవేదన వ్యక్తం చేశారు. నగరం టాయిలెట్లు ప్రజలకు అందు బాటు లో లేవని, ప్రజారోగ్యం విభాగం అధికారులు దృష్టి పెట్టడం లేదని, పింక్ టాయిలెట్స్, అమ్మ టాయిలెట్స్ నగర ప్రజలకు,టూరిస్టులకు అందు బాటు లో లేవని,నగరం లో టాయిలెట్స్ వాడకం పై ప్రజలకు టూరిస్టులకు అవగాహన కల్పించాలని అధికారులను సభ్యులు ఆదేశించారు. పాత బస్టాండ్ వద్ద స్క్రాప్ పార్కు లో వంగవీటి మోహన రంగా విగ్రహం ఏర్పాటుకు కౌన్సిల్ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది..
ప్రధాన అంశాలు ఆమోదం
సీనియర్ అసిస్టెంట్లకు, సూపర్ డెంట్ పోస్టుల ప్రమోషన్ల అమలు కోసం అర్హత కలిగిన ఉద్యోగులు సీనియర్టి ప్రకారం ప్రమోషన్ల అమలు చేయాలని కౌన్సిల్ ఆమోదం తెలిపింది.
నగరం లో పారిశుధ్య పనులు నిర్వహణ కోసం 150 మంది పారిశుధ్య కార్మికుల ను ఒక సంవత్సర కాలం పాటు ఒక్కొక్కరికి రూ.21,000/- చెల్లించుటకు,3 నెలల పాటు రూ.1.06 కోట్లు కార్పోరేషన్ జనరల్ నిధుల నుంచి చెల్లించుటకు కౌన్సిల్ ఆమోదం వేసింది.
విజయవాడ నగర లో ఎలక్ట్రికల్ వాహనాలు వినియోగం పెరుగుతున్న దృష్ట చార్జింగ్ సదుపాయాలు అందించుటకు ఎలక్ట్రికల్ వాహన తయారీ దారులు వారి సొంత ఖర్చులతో ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయుటకు ఎమ్మెల్యే బోండా ఉమా ప్రతి పదాన ను కౌన్సిల్ తీర్మానించింది.
పాత బస్టాండ్ వద్ద గల స్క్రాప్ పార్కు లో కోప్షన్ మెంబర్ సుభాషిణి తన సొంత ఖర్చులతో వంగవీటి మోహన రంగా విగ్రహం ఏర్పాటు చేయుటకు పెట్టిన ప్రతి పాదనను కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది..
రాణిగారి తోట బాపనయ నగర్ మెయిన్ రోడ్డు ను కొత్తగా బీటీ రోడ్డు ఏర్పాటు చేయుటకు, సిద్ధం కృష్ణ రెడ్డి రోడ్డు ను బీటీ రోడ్డు గా నిర్మాణం పూర్తి చెయ్యాలని, సబ్ వే ను త్వరగా పనులు ప్రారంభించాలని, రాణిగారి తోట లో జంక్షన్ కు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జంక్షన్ గా నామ కరణం చేయాలని కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి ప్రతి పాదన ను కౌన్సిల్ ఆమోదం ముద్ర వేసింది..
విజయవాడ నగర పాలక సంస్థ ఉద్యోగస్తులకు రాష్ట ప్రభుత్వం నుంచి రావలసిన బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించుటకు తగు చర్యలు తీసుకోవాలని తీర్మానించింది.
విజయవాడ నగర పాలక సంస్థ అన్ని డివిజన్ లలో ప్రజలకు సరఫరా చేస్తున్న మంచినీటి లోపాలు పరిశీలించుటకు ఐ.బి.యం,ల్యాబ్ ను హెడ్ వాటర్ వర్క్స్ వద్ద ఏర్పాటు చేయుటకు రాష్ట ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని ప్రతి పాదన కౌన్సిల్ సమావేశం లో అమోదం చేశారు..
విజయవాడ నగర పాలక సంస్థ ప్రజా ఆరోగ్యం విభాగం నందు ఆఫ్కాస్ ద్వారా పని చేయుచున్న 3454 మంది కార్మికులకు, వాచ్ మెన్ లకు సంబంధించి సవంత్సర కాలం నకు ది. 01-04- 2026 నుంచి, ది.31-03-2027 వరకు పారిశుధ్య నిధులు నిర్వహించుటకు 2026-2027 ఆర్థిక సంవత్సరానికి జీతాలు చెల్లించుటకు రూ. 135 కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రొవిజన్ గా చూపబడింది అని తెలుపుతూ విజయవాడ నగర పాలక సంస్థ జనరల్ ఫండ్స్ నుండి సదరు వేతనములు చెల్లించుటకు అనుమతి కోరుతూ ఆఫీస్ వారి సూచనను కౌన్సిల్ సమావేశం ఆమోదం తెలిపింది.
విజయవాడ నగర పాలక సంస్థ స్టాడింగ్ కమిటి సభ్యులు పెట్టిన ప్రతి పాదన , విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలోని మా ఆర్ట్స్ కు చెందిన అనధికార హోర్డింగ్ లు,ఎల్. ఈ.డీ, స్క్రీన్ లు, హోర్డింగ్ లు రద్దు చేస్తూ కౌన్సిల్ ఆమోదం వేసింది .
