రైతులూ.. స‌ద్వినియోగం చేసుకోండి!

ఊట్కూర్, ఆంధ్ర‌ప్ర‌భ : సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాల‌ని, ప‌త్తి మద్దతు ధర పొందాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయక్ (Collector Sikta Patnaik) సూచించారు. ఈ రోజు నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని తిప్రాస్ పల్లి విజయ కాటన్ మిల్లులో ఏర్పాటు చేసిన సీసీఐ ప‌త్తి కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగాకలెక్టర్ మాట్లాడుతూ పత్తి పంట విక్రయించిన రైతులకు రైతుల ఖాతాల్లో సకాలంలో డబ్బులు జమ చేసే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు.

కొనుగోలు కేంద్రాల (Purchase centers) వద్ద రైతులకు అన్ని వసతులు కల్పించాలని క‌లెక్ట‌ర్‌ సూచించారు. రైతులు పండించిన పత్తి పంటను ఎండబెట్టి తేమశాతం 8 నుండి 12 శాతం మధ్యలో ఉండేవిధంగా చూసుకోవాలన్నారు. రైతులను నాణ్యమైన పత్తి తీసుకువచ్చి మద్దతు ధర పొందడంతో పాటు కాపాస్ కిసాన్ యాప్ సద్వినియోగంచేసుకోవాలని చెప్పారు. ప్రభుత్వం రైతులకు సీసీఐ కొనుగోలు కేంద్రాల వద్ద పత్తి క్వింటాలకు రూ.8110 కనీసం మద్దతు ధర చెల్లిస్తుందని అన్నారు.

అందుకు రైతులు (farmers) ఈ ఏడాది అధిక వర్షాలు కురవడంతో పత్తి పంట పూర్తిగా దెబ్బతిందని తేమ శాతం పరిశీలించకుండా పత్తి కొనుగోలు చేయాలని కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. అందుకు స్పందించిన కలెక్టర్ ఉన్నతాధికారులతో మాట్లాడతానని అన్నారు. అంతకుముందు ఊట్కూర్ ప్రభుత్వ పాఠశాల అంగన్వాడి కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో త‌హ‌శీల్దార్‌ చింతా రవి, ఏవో గణేష్ రెడ్డి, హెచ్ఎం గుర్నాథ్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply