Cotton Mill | పత్తి రైతుల ఆందోళన..

Cotton Mill | పత్తి రైతుల ఆందోళన..

  • కృష్ణ కాటన్ మిల్లు వద్ద పత్తి రైతుల ఆందోళన
  • ఆన్ లైన్ బుకింగ్‌లో భారీ తేడా

Cotton Mill | చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల పట్టణ కేంద్రంలో కృష్ణ కాటన్ మిల్(Cotton Mill) సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం వద్ద ఇవాళ‌ ఉదయం పత్తి రైతులు ఆందోళన చేప‌ట్టారు. రైతులు ఆన్ లైన్‌లో స్లాట్ బుకింగ్ చేసుకున్నారు. రైతులు తమ పత్తిని ట్రాక్టర్ల ద్వారా మిల్లు వ‌ద్ద‌కు తీసుకొచ్చిన అనంతరం తీరా చూస్తే ఆన్ లైన్(Online)లో తేడాలు రావడంతో రైతులు ఆందోళనకు దిగారు.

ఒక రైతు 30క్వింటాళ్లు ఆన్ లైన్ బుకింగ్ ద్వారా స్లాట్ బుక్(Slot Book) చేసుకున్న రైతుకు తీరా ఈరోజు కాటన్ మిల్ కి కాటన్ తీసుకొచ్చిన తరువాత మూడు క్వింటాళ్లు చూపిస్తుండడంతో ఆన్ లైన్ ప్రకారం.. ఇప్పుడు చూపిస్తున్న ప్రకారం సీసీఐ అధికారులు కొనుగోలు చేస్తామని మార్కెటింగ్, సీసీఐ అధికారులు అన‌డంతో తీసుకొచ్చిన పత్తిని ఎక్కడ అమ్ముకోవాలని సీసీఐ కేంద్రం వద్ద రైతుల ధర్నా చేశారు. స్లాట్ బుక్ చేసుకున్న విధంగా కొనుగోలు జరపాలని రైతులు డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రం వద్ద పత్తి లోడుతో వచ్చిన ట్రాక్టర్స్ భారీగా నిలిచిపోయాయి.

Cotton Mill |

Leave a Reply