Corporation | ఫోటోల ప్రదర్శనపై నిరసన…

Corporation | ఫోటోల ప్రదర్శనపై నిరసన…

Corporation | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : అసెంబ్లీలో వైసీపీ నాయకులు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటోలను ప్రదర్శిస్తూ అపవిత్రం చేశారనే ఆరోపణల నేపథ్యంలో శనివారం ఉదయం కర్నూలు నగరంలోని సంకల్ బాగ్‌లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుదీకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీ.జి. భరత్ పాల్గొన్నారు.

కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, రాష్ట్ర బొందిలి కార్పొరేషన్ చైర్మన్ విక్రం సింఘ్, హజ్ కమిటీ సభ్యుడు మన్సూర్ అలి ఖాన్, పార్లమెంట్ పార్టీ ఉపాధ్యక్షుడు సోమిశెట్టి శ్రీకాంత్, రాష్ట్ర తెలుగుయువత ఉపాధ్యక్షుడు సోమిశెట్టి నవీన్, రాష్ట్ర తెలుగుయువత అధికార ప్రతినిధి జూటూరు రవి కుమార్, కర్నూలు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మారుతి శర్మ, పి. హనుమంతరావు చౌదరి, గట్టు తిలక్, పాల్ రాజ్, రవి చంద్ర శర్మ తదితరులు పాల్గొన్నారు.

Corporation |

ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి శుదీకరణ కార్యక్రమం చేపట్టారు. దేవాలయ ప్రాంగణంలో భక్తులు, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున హాజరై భక్తి గీతాలు ఆలపించారు. అనంతరం నేతలు మాట్లాడుతూ అసెంబ్లీలో జరిగిన ఘటనను ఖండిస్తూ దేవతా చిత్రాల పట్ల గౌరవభావం పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply