486 సహకార కేంద్ర బ్యాంక్ ఉద్యోగుల నిరసన, నినాదాలు…

486 సహకార కేంద్ర బ్యాంక్ ఉద్యోగుల నిరసన, నినాదాలు…
40 నెలలు కాలం పూర్తవుతున్న వేతన సవరణ జరగదా?…
ఏప్రిల్ 13 నుంచి రాష్ట్రవ్యాప్త సమ్మె పిలుపు..
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో ఉన్న 468 జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఆధ్వర్యంలో బుధవారం నిరసన ధర్నా భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలం ధరించి ప్రభుత్వానికి సమస్యల పోరాటానికి కార్యక్రమాన్ని చేపట్టారు. దేశంలోని బ్యాంకింగ్ రంగంలో ప్రభుత్వ రంగ ప్రైవేటు గ్రామీణ బ్యాంకులు రాష్ట్రంలోని సహకార బ్యాంకుల వేతన సవరణ పూర్తి అయినది కానీ రాష్ట్రంలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఉద్యోగుల వేతగా సవరణ 44 కరిచినప్పటికీ ఇంత వరకు ఏమాత్రం పట్టించుకోవటం లేదని నిరసన ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు.
నంద్యాల పట్టణంలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ కార్యాలయం ముందు బుధవారం వేతన సవరణ అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపుమేరకు జాయింట్ ఫార్మ్ ఆఫ్ డిసిసిబి ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకులు నారాయణరెడ్డి, సుబ్బారెడ్డి, కేవీఎస్ రవికుమార్, బాలాజీ ప్రసాద్ తో పాటు అధ్యక్షులు ప్రతాపరెడ్డి,జనరల్ సెక్రెటరీ వీరసింహారెడ్డి, రాఘవేంద్ర,నంద్యాల డిసిసిబి బ్రాంచ్ పరిధిలో యూనియన్ నాయకులు ఎం. హుస్సేన్ భాష, సుకుమార్ రెడ్డి, సౌజన్య దీప్తి లు నిరసన కార్యక్రమం ఆందోళన కార్యక్రమం చేపట్టారు.
వారు మాట్లాడుతూ దేశంలోని బ్యాంకింగ్ రంగంలో సహకార కేంద్ర బ్యాంకు ఉద్యోగుల వేతన సవరణ అమలు చేయాలని కోరుతూ బ్యాంకు యాజమాన్యాలకు నోటీస్ లు అందించామన్నారు. దేశంలోని అన్ని సహకార బ్యాంకులో ప్రైవేటు గ్రామీణ బ్యాంకులు ఏపీలోనూ తెలంగాణలోనూ సహకార బ్యాంకు ఉద్యోగులకు వేతన సవరణ పూర్తి అయ్యింది. కానీ 40 నెలలు కాలం పూర్తవుతున్న ఏపీలోని 13 జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో పనిచేస్తున్న కొన్ని వెల మంది ఉద్యోగులకు వేతన సవరణ అమలు లో జరుగుతున్న జాప్యానికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టటం జరిగిందన్నారు.
ఆందోళన ధర్నా నిరసన కార్యక్రమంలో భాగంగా రెండవ దశలో ఏప్రిల్ 4వ తేదీన జిల్లాల వారీగా విజయవాడలోని ఆప్కాబ్ కేంద్ర కార్యాలయం వద్ద నిరసన ధర్నా ప్రదర్శన లు ఆందోళన కార్యక్రమాలుచేయటం జరుగుతుందన్నారు. అప్పటికి యాజమాన్యం చర్చించి నిర్ణయం తీసుకోక పోతే, సానుకూలంగా నిర్ణయం రాకపోతే ఏప్రిల్ 13వ తేదీ నుంచి రాష్ట్ర వార్త సమ్మె కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. బ్యాంకు కార్యకలాపాలని స్తంభింప చేస్తామన్నారు.
రాష్ట్రంలో పనిచేస్తున్న జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఉద్యోగులతో నిరసన కార్యక్రమం భారీ ఎత్తున చేపడతామన్నారు. రాష్ట్రంలో ఉన్న 468 జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల బ్రాంచీలను ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఎం. హుస్సేన్ భాష నాగమణి జిల్లెల్ల రూప, ప్రియాంక తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
