Control Office | ప్రారంభోత్స‌వం..

Control Office | ప్రారంభోత్స‌వం..

కర్నూలులో డిప్యూటీ డైరెక్టర్, డ్రగ్స్ కంట్రోల్ కార్యాలయం, ప్రయోగశాల భవనం ప్రారంభం

Control Office

Control Office | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు ప్రభుత్వ కంటి ఆస్పత్రి సమీపంలో నూతనంగా నిర్మించిన డిప్యూటీ డైరెక్టర్, డ్రగ్స్ (Drugs) కంట్రోల్ కార్యాలయం, ప్రాంతీయ ప్రయోగశాల భవనాన్ని ఈ రోజు ప్రారంభించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, పాణ్యం శాసనసభ్యులు గౌరు చరిత ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, ఔషధాల నాణ్యత నియంత్రణలో ఈ భవనం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రజలకు సురక్షితమైన, ప్రమాణబద్ధమైన ఔషధాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ తరహా మౌలిక వసతులను అభివృద్ధి చేస్తోందని పేర్కొన్నారు.

Control Office

ఎమ్మెల్యే (MLA) మాట్లాడుతూ, డ్రగ్స్ కంట్రోల్ శాఖ సేవలు మరింత సమర్థవంతంగా అందుబాటులోకి రావడానికి ఈ కార్యాలయం, ప్రయోగశాల దోహదపడుతాయని తెలిపారు. కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొని నూతన భవన సౌకర్యాలను పరిశీలించారు. ప్రజారోగ్య పరిరక్షణలో ఈ కేంద్రం కీలకంగా నిలుస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఔషధ నియంత్రణ శాఖ ఏడీ తేజ తదితరులు పాల్గొన్నారు.

Control Office
Control Office
Control Office
Control Office

Leave a Reply