50 స్టేషన్లలో కంట్రోల్ సెంటర్లు రెడీ
విజయవాడ, ఆంధ్రప్రభ : తీవ్ర తుఫాను మొంథా తాకిడితో ఏపీ తీరప్రాంత జనం కలవరపడుతుంటే.. ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా మొంథా తుపాను నుంచి తప్పించు కోవటానికి ఏపీ ప్రభుత్వం(AP Govt) సర్వసన్నద్దమవుతుంటే.. మరో వైపు రైల్వే శాఖ కూడా అలెర్ట్ అయింది. తుఫాను ప్రభావిత విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, రాజమహేంద్రవరం ప్రాంతాల్లో రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్‌కుమార్ శ్రీవాస్తవ పర్యటించి, హై అలర్ట్ ప్రకటించారు.
అనంతరం విజయవాడలో డివిజన్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనాకియా, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. ప్రయాణికుల భద్రత, రైళ్ల రాకపోకలు, విపత్తు నిర్వహణపై వివిధ సూచనలు చేశారు. ఈ చర్యలు తుఫాను వల్ల రైల్వే ఆపరేషన్లు(railway operations) సాఫ్ట్‌గా సాగేలా చేస్తాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం (అక్టోబర్ 27) జీఎం సంజయ్‌కుమార్ శ్రీవాస్తవ తుఫాను ప్రభావం ఉండొచ్చనే తీరప్రాంత రైల్వే లైన్లు, స్టేషన్లు, ట్రాక్‌లను పరిశీలించారు.
విశాఖపట్నం, రాజమహేంద్రవరం విభాగాల్లో ప్రధానంగా దృష్టి సారించారు. ప్రభావిత ప్రాంతాల్లో హై అలర్ట్(high alert) ప్రకటించి, ఆపరేషనల్, ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్, మెడికల్ విభాగాల అధికారులకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.విజయవాడ డీఆర్ ఎం మోహిత్ సోనాకియా వివరించారు. ప్రస్తుతానికి, ప్రభావిత ప్రాంతాల్లోని 50కి పైగా రైల్వే స్టేషన్లలో కంట్రోల్ రూమ్(Control Room)లు ఏర్పాటు చేశారు.
రైలు వంతెనలు, నీటి ప్రవాహాలు, ట్రాక్‌లు, బ్రిడ్జిలపై పెట్రోలింగ్ బృందాలు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో గమ్య స్థానం చేరుకునేందుకు డిజిటల్ లోకో మోటివ్‌లు, మొబైల్ రెస్క్యూ టీమ్‌లను సిద్ధం చేశారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ సమన్వయంతో పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో దాదాపు 1,200 కిలో మీటర్ల ట్రాక్‌లు, 150కి పైగా స్టేషన్లు ప్రభావితం కావొచ్చని అంచనా వేశారు. మవ్వొచ్చు. ప్రయాణికుల భద్రతే మా మొదటి ప్రాధాన్యత” అని పేర్కొన్నారు. భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం, మొంథా తుఫాను(Cyclone Montha) పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ, అక్టోబర్ 28 సాయంత్రం తీరం దాటే అవకాశం ఉంది. 90 కిలోమీటర్ల నుంచి -110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ఆంధ్ర, ఒడిషా తీరాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రస్తుతానికి, 20కి పైగా రైళ్లు ఆలస్యమవ్వడం, కొన్ని డైవర్షన్లు జరుగుతున్నాయి.

