హైదరాబాద్, ఆంధ్రప్రభ : హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఇంటికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) వచ్చారు. గత కొన్ని రోజులుగా వైరల్ ఫీవర్(Viral Fever)తో బాధపడుతున్న పవన్ కల్యాణ్‌ను ఆయన పరామర్శించారు.
ఈ సందర్భంగా డాక్టర్లతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని కోరారు. పవన్ కల్యాణ్ వైరల్ జ్వరంతో బాధపడుతున్నట్లు ఐదు రోజుల క్రితం ఏపీ డిప్యూటీ సీఎం కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. వైద్యులు విశ్రాంతి అవసరమని సూచించినప్పటికీ మంగళవారం శాఖాపరమైన అంశాలపై అధికారులతో టెలికాన్ఫరెన్సులు నిర్వహించినట్లు ప్రకటించింది.