Consultation | టీడీపీ కార్య‌క‌ర్త‌కు పరామర్శ

Consultation | అవనిగడ్డ, ఆంధ్రప్రభ : రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అవనిగడ్డకు చెందిన టీడీపీ కార్యకర్త గరికిపాటి పోతురాజును ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు(srinivas rao) శనివారం పరామర్శించారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న పోతురాజును కనపర్తి శ్రీనివాసరావు ఆసుపత్రికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం, చికిత్స అందిస్తున్న వైద్యులతో మాట్లాడి, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి(Current health condition)పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని ఆయన వైద్యులను కోరారు. ఆయ‌న వెంట‌ దివి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ కొల్లూరి వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు బండే శ్రీనివాసరావు, పర్చూరి దుర్గాప్రసాద్, బండే రాఘవ, కర్రా సుధాకర్, కొక్కిలిగడ్డ జాన్ విల్సన్, మేడికొండ విజయ్(Medikonda Vijay), గుంటూరు వినయ్, అడపా శ్రీను, కొల్లూరి వాసు, కొల్లూరి ఇమ్మానియేలు, కమ్మిలి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

Leave a Reply