Construction works | నిర్మాణ పనులను వేగవంతం చేయాలి

Construction works | నిర్మాణ పనులను వేగవంతం చేయాలి

  • ప్రభుత్వ విద్యా సంస్థల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
  • కాసీపేటలో కస్తూరిబా గాంధీ విద్యాలయం, గిరిజన ఆశ్రమ పాఠశాల‌లు పరిశీలించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
  • పోషకాహారం, నాణ్యమైన బోధనపై అధికారులకు ఆదేశాలు

Construction works | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : ప్రభుత్వ విద్యా సంస్థలలో చేపట్టిన అభివృద్ధి, నిర్మాణ పనులను(Construction works) వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. ఈ రోజు జిల్లాలోని కాసిపేట మండల కేంద్రంలో ఉన్న కస్తూరిబా గాంధీ(Kasturba Gandhi) బాలికల విద్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్, అక్కడ కొనసాగుతున్న అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ విద్యార్థులకు సకల సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తోందని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పోషక విలువలు(nutritional values కలిగిన మెనూను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో విద్యాలయంలో చేపట్టిన అదనపు గదుల నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని, సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. అనంతరం మండలంలోని దేవాపూర్‌లో గల ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సందర్శించి రిజిస్టర్లు, తరగతి గదులు, వంటశాల, పరిసరాలను పరిశీలించారు.

విద్యార్థులకు మెనూ ప్రకారం(menu as per) సకాలంలో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించడంతో పాటు శుద్ధమైన త్రాగునీటిని అందించాలని, వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. పాఠశాలలో చేపట్టిన మరమ్మత్తు పనులను వేగవంతం చేసి గుత్తేదారులతో సమన్వయం చేసుకుంటూ త్వరగా పూర్తయ్యేలా చర్యలు(actions) తీసుకోవాలని తెలిపారు.

ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధన చేయాలని, తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply