Construction | భవన నిర్మాణానికి శంకుస్థాపన…

Construction | భవన నిర్మాణానికి శంకుస్థాపన…

Construction | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా సంఘాలు ఆర్థికంగా బలోపేతం కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి పేర్కొన్నారు. ఆదివారం బెల్లంపల్లి మండలంలోని పెర్కపల్లి గ్రామపంచాయతీలో రూ. 10 లక్షల వ్యయంతో నిర్మించనున్న గ్రామ సమాఖ్య సంఘ భవనం నిర్మాణ పనులకు ఆయన భూమి పూజ చేసి, కొబ్బరి కొట్టి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామైక్య సంఘాలకు ప్రత్యేక భవనాల నిర్మాణం ద్వారా మహిళలకు మరింత భరోసా లభిస్తుందని, ఇక్కడ నిర్వహించే స్వయం ఉపాధి కార్యక్రమాల ద్వారా మహిళలు ఆర్థిక పురోగతి సాధిస్తారని ఆకాంక్షించారు. ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అభివృద్ధి పనుల్లో వేగం పెంచుతామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ కారుకూరి రామచందర్, ఎంపీడీవో, గ్రామ సర్పంచ్ సాయి, నాయకులు నాతారీ స్వామి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply