అంగన్‌వాడీ భవనానికి శ్రీకారం…

అంగన్‌వాడీ భవనానికి శ్రీకారం…
- రూ.12 లక్షల వ్యయంతో చేపడుతున్న నిర్మాణం
- స్లాబ్ పనుల ప్రారంభించిన సర్పంచ్ సంపత్ కుమార్
స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్‌పూర్ మండలం మీదికొండ గ్రామంలో గ్రామాభివృద్ధికి మరో ముఖ్యమైన అడుగు పడింది. ఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకం కింద రూ.12 లక్షల వ్యయంతో నిర్మాణంలో ఉన్న నూతన అంగన్‌వాడీ భవనానికి సంబంధించిన స్లాబ్ పనులను శనివారం ఉప సర్పంచ్ అలకుంట్ల శ్రీనుతో కలిసి సర్పంచ్ జోగు సంపత్ కుమార్ ప్రారంభించారు.
ఈ సంద ర్భంగా సర్పంచ్ జోగు సంపత్ కుమార్ మాట్లాడుతూ…గత రెండు సంవత్సరాలుగా వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్న పనులను తన పదవీకాలంలో పూర్తి చేయడం ఎంతో సంతోషకరమని తెలిపారు. గ్రామ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడం, అభివృద్ధి పనులను వేగ వంతం చేయడం తన ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. అలాగే గ్రామంలో మౌలిక వసతులను మెరుగుపరచడానికి కట్టుబడి ఉన్నామ ని పేర్కొన్నారు. ప్రతి సమస్యను గుర్తించి తక్షణమే పరిష్కరించే విధం గా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తూ మీది కొండను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతున్నా మని వెల్లడించారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి సేవ చేసేందుకు కట్టుబడి ఉన్నానని సర్పంచ్ ఈ సందర్బంగా పేర్కొన్నారు.
