Construction | అండర్ పాస్ జాతీయ రహదారిపై నిర్మాణం చేయాలి…

Construction | అండర్ పాస్ జాతీయ రహదారిపై నిర్మాణం చేయాలి…

  • రెండు గ్రామాల ప్రజల నిరసన…

Construction | శంకరపట్నం, ఆంధ్రప్రభ : కొత్తగట్టు గొల్లపల్లె గ్రామ ప్రజల సౌకర్యార్థం జాతీయ రహదారిపై అండర్ పాస్ నిర్మాణం చేయాల్సిందేనని రెండు గ్రామాల ప్రజలు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడారు. కరీంనగర్ జిల్లా, మానకొండూర్ నియోజకవర్గం, శంకరపట్నం మండలం, కొత్తగట్టు గొల్లపల్లె గ్రామ లో ఎన్ హెచ్ 563 జాతీయ రహదారి నిర్మాణం జరుగుతుందని, జాతీయ రహదారి నిర్మాణంతో కొత్తగట్టు గొల్ల పల్లె ప్రజలకు అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అండర్ పాస్ నిర్మాణం చేస్తే ప్రజల ఇబ్బందులు తొలగిపోతాయని, పాలకులకు ఉన్నతాధికారులకు నివేదించిన గ్రామ ప్రజల కష్టాలను పట్టించుకోవడంలేదని, జాతీయ రహదారి నిర్మాణం పనులు ప్రజలకు ఇబ్బందికరంగానే నిర్మాణం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రామపంచాయతీ ఎదుట జాతీయ రహదారి పైన నిరసన వ్యక్తం చేస్తూ పనులను నిలిపివేయాలని డిమాండ్ చేయగా జాతీయ రహదారి నిర్మాణ సంస్థ అధికారులు నిరసన స్థలానికి చేరుకొని గ్రామస్తులతో చర్చించి ఉన్నతాధికారులకు నివేదిస్తామని హామీ ఇవ్వడంతో నిరసన కార్యక్రమాన్ని విరమించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ వంగల వీరేందర్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply