Construction | మక్తల్ – పేట కొడంగల్ ఎత్తిపోతల పనులు ప్రారంభం.

Construction | మక్తల్ – పేట కొడంగల్ ఎత్తిపోతల పనులు ప్రారంభం.
Construction | ఊట్కూర్, ఆంధ్రప్రభ : మక్తల్- నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ 2నిర్మాణానికి నారాయణపేటజిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని బాపూర్ వద్ద సోమవారం ఇరిగేషన్ శాఖ అధికారులు భూమి పూజ చేపట్టి పనులు ప్రారంభించారు. ఇరిగేషన్ శాఖ చీప్ ఇంజనీర్ ఏ ఎస్ ఎన్ రెడ్డి,ఎస్ ఈ శ్రీధర్, ఈ ఈ బ్రహ్మానంద రెడ్డి, మెగా కంపెనీ జి ఎం ఎం శ్రీనాథ్ రెడ్డి పనులు ప్రారంభించారు. మక్తల్ – నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా ఊట్కూర్ పెద్ద చెరువు నింపుతున్నట్లు తెలిపారు. పెద్ద చెరువు నుండి కొడంగల్ కు నీటిని తరలిస్తారు.
ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ అధికారులు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సహకారంతో అన్నదాతలకు మద్దతు తెలిపి భూములు ఇచ్చేందుకు ఎకరాకు రూ 20 లక్షలు చొప్పున ఇవ్వడంతో త్వరితగతిన పూర్తి పనులు చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నామని అన్నారు. స్టేజ్ 2 లో భాగంగా బాపూర్ దగ్గర నిర్మాణం కొరకు పనులు ప్రారంభించినట్లు వివరించారు. ఫేస్ 2 లో భాగంగా బాపూర్ వద్ద రెండు పంపులతో ఇక్కడి నుండి నీటిని ఎత్తిపోస్తున్నట్లు తెలిపారు. 35 మెగావాట్ల సామర్థ్యం గల రెండు పంపులు ఏర్పాటు చేసి 1483 క్యూసెక్కుల నీటిని పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డి ఈ ఫహీమ్, ఏఈలు వెంకటప్ప, సురేష్, తిరుపతి, అక్షయ్ తదితరులు పాల్గొన్నారు.
