Constraint | బాలుడిని నిర్భంధించిన దమ్మపేట రేంజర్

Constraint | బాలుడిని నిర్భంధించిన దమ్మపేట రేంజర్
12 గంటలకు పైగా బంధించిన వైనం
తండ్రి చెట్లు నరికాడన్న ఫిర్యాదు మేరకు అతని స్థానంలో కొడుకు పై చర్య
Constraint | అశ్వారావుపేట, ఆంధ్రప్రభ : తండ్రి చెట్లు నరికాడన్న ఆరోపణతో అతడు పరారీలో ఉండగా, అతని కొడుకుని 12గంటలకు పైగా అటవీశాఖ (Forest Department) అధికారులు నిర్బంధించిన సంఘటన నియోజకవర్గ కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ప్రకారం అశ్వారావుపేట మండలంలోని సున్నం బట్టి అటవీ ప్రాంతం దమ్మ పేట అటవీ రేంజ్ పరిధిలోకి వస్తుంది. ఈ ప్రాంతంలో చెట్లు నరుకుతున్నారన్న సమాచారం మేరకు దమ్మపేట రేంజర్ శ్రీనివాసరావు తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి వెళ్లారు.
ఈ క్రమంలో గుర్తుతెలియని వ్యక్తులు అడవిలోని నాలుగు నారవేప చెట్లను నరికి వేయడం అధికారులు గమనించారు. సంఘటనపై చింతలపూడి వెంకటేశ్వర చారి, షేక్ ఖాసిం అనే వ్యక్తులను అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకొని దమ్మపేట రేంజ్ కార్యాలయానికి తరలించారు. ఇదిలా ఉండగా దమ్మపేట రేంజర్ (Dammapeta Ranger) సంఘటనా స్థలంలోకి వెళ్లేసరికి నరికి వేసిన చెట్ల లోడింగ్ కోసం వచ్చిన వాహనం అతనిని చూసి వెళ్ళిపోగా ఆ వాహనంలో మణి అనే వ్యక్తి ఉన్నాడని అటవీ అధికారులు గమనించారు. దీంతో అధికారులు చేసేదేమీ లేక బుధవారం ఉదయం అశ్వారావుపేట పట్టణంలోని మణి ఇంటికి ఆయన కోసం రాగా, మణి చిన్న కుమారుడు ఇంట్లో నిద్రిస్తుండగా ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అటవీశాఖ అధికారులు బాలుడిని అశ్వారావుపేట రేంజ్ కార్యాలయానికి తీసుకుని వెళ్లారు.
ఉదయం వేళ తీసుకెళ్లిన బాలుడిని సుమారు 12 గంటలకు పైగా రేంజ్ కార్యాలయంలోనే ఉండటం గమనార్హం. దీంతో బాలుడు తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. ఈ విధంగా అభం శుభం ఎరుగని బాలుడిని రోజంతా రేంజ్ కార్యాలయంలో నిర్బంధించటంపై (Constraint) పట్టణ ప్రజలు తీవ్ర అగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నారు. తండ్రి తప్పు చేస్తే అతనిని పట్టుకుని శిక్షించాలి గాని ఇంట్లో ఉన్న బాలుడిని నిర్బంధించటం ఎంతవరకు సబబు అని వారు అధికారులను ప్రశ్నిస్తున్నారు. దమ్మపేట రేంజర్ వద్ద ప్రస్తావించగా, ఇంట్లో ఎవరూ లేకపోవడంతో బాలున్ని తీసుకొచ్చి రేంజ్ ఆఫీసులో ఉంచామని చెబుతూ మిగిలిన వివరాలేవీ వెల్లడించలేదు.
