Constituency | ప‌రిమ‌ళించిన మానవత్వం

Constituency | ప‌రిమ‌ళించిన మానవత్వం

  • బాధితుడి వైద్యానికి రూ.50 వేలు
  • అంద‌జేసిన మార్కెట్ చైర్మన్ ఉమా సంజీవ్ కుమార్ యాదవ్

Constituency | వెల్దండ, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ కల్వకుర్తి నియోజకవర్గం(Constituency) వెల్దండ మండల పరిధిలోని పొతేపల్లి గ్రామానికి చెందిన సాయిదత్త హోటల్ కడారి రామచంద్రయ్య అనారోగ్యానికి గురై హైదరాబాద్‌లోని గాంధీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉమా సంజీవ్ యాదవ్ బుధవారం బాధితుడిని పరామర్శించి మనోధైర్యం చెప్పారు.

ఈ సందర్భంగా వైద్య సిబ్బంది(medical staff)తో మాట్లాడి రామచంద్రయ్యకు మెరుగైన వైద్యం అందించాలని తెలియజేశారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు 50వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని(financial assistance) అందజేశారు. ఈ కార్యక్రమంలో గోటి సత్యనారి మాజీ ఎంపీటీసీ కాల్ రామ్ నాయక్, కుమార్, దుడ్డు శేఖర్, ఇస్లావత్ సుధ‌ర్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply