
Constituency | కొత్త సర్పంచ్‌లకు అభినందనలు
Constituency | కొత్త సర్పంచ్‌లకు అభినందనలు
Constituency | భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ : మండలంలోని పిప్రి, పల్లికొండ, బాచన్ పల్లి గ్రామాల సర్పంచ్‌లుగా విజయం సాధించిన వారు గురువారం బాల్కొండ నియోజకవర్గం(Constituency) కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ముత్యాల సునిల్ కుమార్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. మోర్తాడ్ ప్రజా నిలయానికి చేరుకున్న సర్పంచ్‌లు అరిగేల జనార్దన్, వన్నెల జనార్దన్, గంగం అశోక్‌లు ముత్యాలను కలిసిన వారిలో ఉన్నారు.
కొత్తగా సర్పంచ్‌లుగా ఎన్నికైన వీరిని ముత్యాల సునిల్ కుమార్ సత్కరించారు. సర్పంచ్‌లుగా విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు. వీరి వెంట మండల నాయకులు ఉన్నారు.
