ఉట్నూర్, మార్చి 15 (ఆంధ్రప్రభ) : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని శ్యాంనాయక్ తాండకు చెందిన పవార్ రాహుల్ కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తూ గ్రూప్-3 లో కొలువు సాధించినట్లు ఆయన బంధువులు తెలిపారు. శుక్రవారం వెలువడిన గ్రూప్ 3 ఫలితాల్లో సీటు సాధించినట్లు బంధువులు తెలిపారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చునని రాహుల్ నిరూపించుకున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు పరిశ్రమల శాఖ విశ్రాంతి జనరల్ మేనేజర్ రామ్ కిషన్ నాయక్ అన్నారు.
రాహుల్ కృషిని ఆయన అభినందించారు. పట్టుదల ఉంటే ఎంతటి ఉద్యోగానైనా సాధించవచ్చని నిరూపించుకున్నారని ఆయన కొనియాడారు. ప్రస్తుతం రాహుల్ ఉట్నూర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. రాహుల్ గ్రూప్ 3 లో ఎస్ టి కోటాలో బాసర్ జోన్ మూడవ ర్యాంకు సాధించారని ఆయన బంధువులు తెలిపారు.