రహదారుల నిర్మాణం వేగవంతం…

రహదారుల నిర్మాణం వేగవంతం…
- అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
చల్లపల్లి – ఆంధ్రప్రభ : కూటమి ప్రభుత్వ సహకారంతో నియోజకవర్గంలో రహదారుల నిర్మాణం వేగవంతం చేసినట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. మంగళవారం చల్లపల్లి మండలం లక్ష్మీపురం పంచాయతీ రామానగరంలో ఓ.ఆర్.సీ క్లబ్ పక్కన రూ.45లక్షలతో చల్లపల్లి- మచిలీపట్నం ఆర్ అండ్ బీ రోడ్డు వద్ధ నుంచి హైవే వరకూ నిర్మిస్తున్న హైవే కనెక్టివిటీ రోడ్డు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.
పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా మంజూరు చేసిన ఉపాధి హామీ పథకం నిధులతో పాటు, సాస్కి నిధులతో నియోజకవర్గంలో గ్రామీణ రహదారులు అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. రహదారి నిర్మాణం నాణ్యతా ప్రమాణాలతో సకాలంలో పూర్తి చేయాలని పంచాయతీ రాజ్ శాఖ డీఈఈ పగడాల సురేష్ బాబుకు సూచించారు.
