ప్రశాంతంగా ముగిసిన కౌంటింగ్…

ప్రశాంతంగా ముగిసిన కౌంటింగ్…
- 18 వార్డుల్లో కాంగ్రెస్ 13, బిఆర్‌ఎస్ 5 కైవసం
స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం ప్రశాంత వాతావరణంలో పూర్తయింది. మొత్తం 18 వార్డులకు నిర్వహించిన కౌంటింగ్‌లో కాంగ్రెస్ పార్టీ 13 వార్డుల్లో విజ యం సాధించి స్పష్టమైన ఆధిక్యం దక్కించుకోగా, బిఆర్‌ఎస్ పార్టీ 5 వార్డుల్లో గెలుపొందింది. ఫలితాలు వెలువడిన వెంటనే మున్సి పాలిటీలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సాధించి ఆధిపత్యం ప్రదర్శించింది..
-వార్డుల వారీగా ఫలితాలు:
వార్డు 1: తాటికొండ మధు (బిఆర్‌ఎస్) 390 ఓట్లతో 53 ఓట్ల మెజా రిటీతో గెలుపొందారు. సింగాపురం దయాకర్ (కాంగ్రెస్) 337, చింత రాజశేఖర్ (బీఎస్పీ) 7, చింత బన్నీ (ఇండిపెండెంట్) 61, సింగాపురం కమలాకర్ (ఇండిపెండెంట్) 106 ఓట్లు పొందారు.
వార్డు2: గుర్రం హరినాథ్ (కాంగ్రెస్) 406 ఓట్లతో 143 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. గుర్రం శంకర్ (బిఆర్‌ఎస్) 263, రాడపాక ప్రదీప్ (బీజేపీ) 20, గుర్రం యాదగిరి 133, గుర్రం శ్రీను 90, గుర్రం క్రాంతి కుమార్ 8 ఓట్లు పొందారు.
వార్డు3: గుర్రం హైమ (కాంగ్రెస్) 555 ఓట్లతో 276 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. గుర్రం రమాదేవి (బిఆర్‌ఎస్) 279, రాజారాప్ రజిని (బీజేపీ) 40, చింత జ్యోత్స్న (ఇండిపెండెంట్) 27 ఓట్లు సాధించారు.
వార్డు 4: బూర్ల రాజేశ్వర్ (బిఆర్‌ఎస్) 519 ఓట్లతో స్వల్ప 19 ఓట్ల తేడాతో విజయం సాధించారు. బూర్ల శంకర్ (కాంగ్రెస్) 500, వంగ వేణు (బీజేపీ) 19, తోట సురేందర్ (ఇండిపెండెంట్) 3 ఓట్లు పొందారు.
వార్డు 5: చల్లా రమ్య (బిఆర్‌ఎస్) 295 ఓట్లతో 20 ఓట్ల తేడాతో గెలుపొందారు. కొంత రజిత (కాంగ్రెస్) 256, పాలకుర్తి రాధిక (బీజేపీ) 275, నీల యాదలక్ష్మి (ఇండిపెండెంట్) 64 ఓట్లు సాధించారు.
వార్డు 6: బాలగాని అనిల్ గౌడ్ (బిఆర్‌ఎస్) 432 ఓట్లతో 109 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కనకం రమేష్ (కాంగ్రెస్) 323, బూర్ల మల్లికార్జున్ (సీపీఐ) 7, చేపూరి రాజశేఖర్ (ఇండిపెండెంట్) 16 ఓట్లు పొందారు.
వార్డు 7: అన్నెపు సుమలత (కాంగ్రెస్) 473 ఓట్లతో 186 ఓట్ల మెజారిటీతో గెలిచారు. బూర్ల స్వప్న (బిఆర్‌ఎస్) 287, బూర్ల స్వాతి (బీజేపీ) 41, వైట్ల సంధ్యరాణి (ఇండిపెండెంట్) 88 ఓట్లు సాధించారు.
వార్డు 8: పొన్న రాజేష్ (బిఆర్‌ఎస్) 487 ఓట్లతో 254 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. చాతారబోయిన సత్యనారాయణ (కాంగ్రెస్) 233, బూర్ల కుమార్ (బీజేపీ) 13, బూర్ల యాదగిరి (సీపీఐ) 4 ఓట్లు పొందారు.
వార్డు 9: సౌధరపల్లి సంపత్ రాజు (కాంగ్రెస్) 755 ఓట్లతో భారీ 579 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. కనకం గణేష్ (బిఆర్‌ఎస్) 176, బస్కుల రాజేందర్ (బీజేపీ) 12, ఇందు శ్రావణి (బీఎస్పీ) 7, ఆకుల నర్సింగం 12, బస్కుల యాదగిరి 8, బస్కుల నాగరాజు (డీఎస్పీ) 8 ఓట్లు సాధించారు.
వార్డు 10: తొకల అనూష (కాంగ్రెస్) 537 ఓట్లతో 60 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తాటికొండ రమ (బిఆర్‌ఎస్) 468 ఓట్లు పొందారు.
వార్డు 11: నీల రాజమ్మ (కాంగ్రెస్) 352 ఓట్లతో 30 ఓట్ల తేడాతో గెలిచారు. ఊరడి లక్ష్మి (బిఆర్‌ఎస్) 314, గట్టు అరుణ (ఇండిపెండెంట్) 241, పరకాల సుకుమారి 11 ఓట్లు పొందారు.
వార్డు 12: గట్టు సంగీత (కాంగ్రెస్) 374 ఓట్లతో 192 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. గట్టు హిమబిందు (ఇండిపెండెంట్) 182, కూరపాటి కవిత (బిఆర్‌ఎస్) 157 ఓట్లు పొందారు.
వార్డు 13: తాటికొండ వినయ్ కుమార్ (కాంగ్రెస్) 529 ఓట్లతో 359 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. మారపల్లి ప్రసాద్ బాబు (బిఆర్‌ఎస్) 90, రాడపాక ఆరోగ్యం 170, సకి సంపత్ 2, సింగాపురం సమ్మయ్య 3, చింతకుంట్ల ప్రసాద్ 3, జీడి రమేష్ 9 ఓట్లు సాధించారు.
వార్డు 14: పెసరు కృష్ణవేణి (కాంగ్రెస్) 417 ఓట్లతో 210 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మారేడుపాక రమాదేవి (బిఆర్‌ఎస్) 207, అమంచ నిర్మల (బీజేపీ) 63 ఓట్లు పొందారు.
వార్డు 15: బొల్లు లక్ష్మి (కాంగ్రెస్) 395 ఓట్లతో 238 ఓట్ల మెజారిటీతో గెలిచారు. గట్టు స్వప్న (బీజేపీ) 157, నీలం సుజాత (బిఆర్‌ఎస్) 155 ఓట్లు పొందారు.
వార్డు 16: అంగడి రజిత కృష్ణ (కాంగ్రెస్) 320 ఓట్లతో 61 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అంగడి సాంబరాజు (బిఆర్‌ఎస్) 259, దేవరాయి భాగ్య (బీజేపీ) 9, అంగడి శ్రీనివాస్ (జైఎస్పీ) 8, గుగులోత్ అరుణ లాల్ (ఇండిపెండెంట్) 248 ఓట్లు పొందారు.
వార్డు 17: పొన్న స్వరూప రాజయ్య (కాంగ్రెస్) 384 ఓట్లతో 60 ఓట్ల మెజారిటీతో గెలిచారు. కొలిపాక మౌనిక (ఇండిపెండెంట్) 324, కుంభం లావణ్య (బిఆర్‌ఎస్) 79, గోనెలా శిరీష (బీజేపీ) 9 ఓట్లు సాధించారు.
వార్డు 18: పొన్న రవి (కాంగ్రెస్) 428 ఓట్లతో 162 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మహమ్మద్ జబ్బార్ (బిఆర్‌ఎస్) 131, ఎదునూరి రమేష్ (ఇండిపెండెంట్) 266, రాజోజు సాయి చరణ్ (జైఎస్పీ) 17, మునిగేలా వెంకన్న (బీఎస్పీ) 4 ఓట్లు పొందారు. మొత్తంగా కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగింది. ఎటువంటి అవాం ఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. ఫలితాలు వెలువడిన వెంట నే విజేతల అనుచరులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీతో మున్సిపాలిటీలో ఆధిపత్యాన్ని సాధిం చింది.
