Congress vs Brs | ప్రమాణస్వీకారానికి ముందే…

Congress vs Brs | ప్రమాణస్వీకారానికి ముందే…

  • కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య గొడవ

Congress vs Brs | చెన్నారావుపేట, ఆంధ్రప్రభ : చెన్నారావుపేట మండల‌ కేంద్రంలో నూతన సర్పంచ్ ప్రమాణస్వీకారానికి ముందే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య గొడవ జరిగింది. సర్పంచ్ స్థానం బీఆర్ఎస్, ఉప సర్పంచ్ కాంగ్రెస్ కి దక్కగా, ప్రమాణస్వీకారానికి ముందే ఇరుపార్టీల నాయకులు ఒకరిపై మరొకరు దాడులకు దిగారు.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి సంబంధించిన పాటలు డీజేలో ఎందుకు వేస్తున్నారని కాంగ్రెస్ పార్టీకి చెందిన యువకుడు వనపర్తి శోభన్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో బీఆర్ఎస్ నాయకులు పాటలు బంద్ చేశారు. అప్పటికే ఇరువురి మధ్య మాటా మాటా పెరిగి కాంగ్రెస్ యువకుడు శోభన్, బీఆర్ఎస్ వార్డు సభ్యులు రమేష్ ఒకరిపై మరొకరు స్టేజ్ దగ్గర వేసిన కుర్చీలతో కొట్టుకోవడంతో గాయలయ్యాయి.

ఉద్రిక్తతల నడుమ ఎంపీడీవో వెంకట శివానంద్, సర్పంచ్ కంది శ్వేతతో పాటు బీఆర్ఎస్ బలపరిచి గెలుపొందిన ఐదుగురి వార్డు సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. కాగా దాడి ఘటనలో త‌మ పార్టీ కార్యకర్త శోభన్ తలకు దెబ్బతగిలిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. త‌మ వార్డు సభ్యులు రమేష్ కు గాయమైందని ప్రమాణస్వీకారం అనంతరం బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Leave a Reply