ఎమ్మెల్యే అండతో అభివృద్ధి పరుగులు..

ఎమ్మెల్యే అండతో అభివృద్ధి పరుగులు..

  • 41వ డివిజన్‌లో కాంగ్రెస్ పట్టు…
  • సంక్షేమ–మౌలిక సదుపాయాల సమన్వయం..

మహబూబ్ నగర్, ఆంధ్రప్రభ : మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని 41వ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి స్వప్న లక్ష్మి యాదవ్ కు ఎన్నికల్లో సానుకూల పరిస్థితులు కనబడుతున్నాయి. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి సంపూర్ణ సహకారంతో మున్సిపల్, ముడా నిధులను సమర్థవంతంగా వినియోగిస్తూ అభ్యర్థి భర్త లక్ష్మణ్ యాదవ్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా కీలక బలంగా మారాయి. ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ నేతృత్వంలో మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాల అమలుకు ప్రాధాన్యం ఇవ్వడంతో డివిజన్‌లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇప్పటివరకు సద్దల గుండు ప్రధాన చౌరస్తా అభివృద్ధి, 45 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, గృహజ్యోతి పథకం ద్వారా 469 కుటుంబాలకు 200 యూనిట్ల విద్యుత్ ఉచిత సౌకర్యం, నిరుపేదలకు రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం సరఫరా వంటి చర్యలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచాయి. అలాగే పింఛన్ దారులకు ప్రతి నెలా నిరంతరంగా పింఛన్ల జమ, మహాలక్ష్మి పథకం కింద రూ.500కే గ్యాస్ సిలిండర్ అందించడం వంటి నిర్ణయాలు ప్రభుత్వం పేదల పక్షాన నిలిచిందన్న భావనను బలపరిచాయి.

ఇదిలా ఉండగా లక్ష్మణ్ యాదవ్ దశాబ్దాలుగా కాంగ్రెస్ జెండా కింద నిలిచి, కాలనీలో అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే కాక సీనియర్ నాయకుడిగా ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి మద్దతు లభించడంతో అభివృద్ధి ఫలాలు నేరుగా ప్రజల దాకా చేరుతున్నాయన్నది స్థానికుల అభిప్రాయం. ఈ సమగ్ర అభివృద్ధి–సంక్షేమ సమన్వయమే రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి స్వప్నకు ప్రజాదరణగా మారనున్నదన్నది రాజకీయ వర్గాల స్పష్టమైన అంచనా.

Leave a Reply