Rayapole | ఘనంగా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం

Rayapole | రాయపోల్, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవాన్ని రాయపోల్ మండలంలోని మండల అధ్యక్షుడు తప్పెట సుధాకర్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి, కాంగ్రెస్ పార్టీ త్యాగభరిత చరిత్రను స్మరించుకున్నారు. ప్రజాస్వామ్యం, లౌకికత్వం, సామాజిక న్యాయమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని నాయకులు పేర్కొన్నారు. నిరుపేద ప్రజల సంక్షేమం కోసం పార్టీ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు సిద్ధం శశికాంత్, ఉసిగారి స్వామి, సత్తు అశోక్, కాంగ్రెస్ నాయకులు ఏఎంసి డైరెక్టర్, ఆరేపల్లి గ్రామ అధ్యక్షుడు బాకీ మల్లేశం, ఆత్మ కమిటీ డైరెక్టర్ జాని, మహేష్, మాజీ ఎంపీటీసీ స్వామి, చందు, పాల రామా గౌడ్,మాజీ సర్పంచ్ యాదిరెడ్డి, గోపాల్, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

Leave a Reply