Congress | మహిళలకు అండగా..

Congress | మహిళలకు అండగా..
Congress, బిక్కనూర్, ఆంధ్రప్రభ : మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad) జిల్లా సహకార బ్యాంకు మాజీ డైరెక్టర్ లింగాల కిష్టా గౌడ్ అన్నారు. ఆదివారం బిక్కనూర్ మండలం కాచాపూర్ గ్రామంలో మహిళా శక్తి చేరలను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ… గత ప్రభుత్వం మహిళల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి అన్ని వర్గాల సంక్షేమానికి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. వాటిని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మహిళలందరికీ నాణ్యమైన చీరలను అందజేయడం జరుగుతుందన్నారు.
మహాలక్ష్మి పథకం పేరుతో ఉచిత ఆర్టీసీ ప్రయాణం మహిళలకు ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం దశల వారీగా అమలు చేస్తుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) అభ్యర్థులకు మద్దతుగా నిలవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సుదర్శన్, గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నర్సింగారావు, పాలకేంద్రం అధ్యక్షులు గాల్ రెడ్డి, నాయకులు నరసింహారెడ్డి, రవీందర్ గౌడ్, అమృత, మోహన్ రెడ్డి, శ్రీహరి తదితరులు ఉన్నారు.
