మోత్కూర్ మున్సిపాలిటీ పై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి..

మోత్కూర్ మున్సిపాలిటీ పై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి..

కారు పోతుల వెంకన్నకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జ్ సంధ్యారెడ్డి

మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూరు మున్సిపాలిటీలో 11వ వార్డు అభ్యర్థి కారుపోతుల వెంకన్న గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి సంధ్యారెడ్డి స్థానిక నాయకులతో కలిసి మెయిన్ రోడ్డులో ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంధ్యారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలకు ప్రజలు, ఓటర్లు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. గత బీఆర్ఎస్ హయాంలో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయలేదన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉచిత కరెంటు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ సబ్సిడీ, రైతు భరోసా, రుణమాఫీ, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇల్లు అందించిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు.

ఈ నెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో మున్సిపాలిలోని 11 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు, 5 వ వార్డు సిపిఐ అభ్యర్థికి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని, మోత్కూర్ మున్సిపాలిటీ పై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని అన్నారు. ఈ సందర్భంగా ఆమె వెంట 11వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కారుపోతుల వెంకన్న, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పైల సోమిరెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ లింగాల నర్సిరెడ్డి ,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండగోని రామచంద్రు, జిల్లా నాయకులు ఇటికాల చిరంజీవి, మధు ,అన్నెపు పద్మ, దాసరి నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply