Congress | బతుకమ్మ చీరలతో ప్రచారం..

Congress | బతుకమ్మ చీరలతో ప్రచారం..

Congress, ఆంధ్రప్రభ : రాయిగూడెం చింతొల్లగుంపు మైలారం, లక్ష్మీపురం, సీతారాంపురం, కొమ్ముగూడెం తదితర గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థి వాసం సుస్మిత, భర్త కాంగ్రెస్ మండల ప్రచార కమిటీ అధ్యక్షులు వాసం శ్రీకాంత్, కాంగ్రెస్ మండల ముఖ్యనేతలు మహమ్మద్ అతాహర్, మహిళలు మంగా, పద్మలతో కలిసి ప్రచారం జోరుగా కొనసాగించారు. ప్రత్యర్థి అభ్యర్థుల కంటే భిన్నంగా వినూత్నంగా రాష్ట్ర ఆత్మగౌరవానికి ప్రతీకగా బతుకమ్మ చీరలతో మహిళలకు కుంకుమ బొట్టును పెట్టి మహిళలందరూ ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డితో పాటు సహకారం మంత్రివర్గం ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉమ్మడి గుండాల అల్లపల్లి మండలాల్లోని అభివృద్ధి అవధులు లేకుండా చేసేందుకు పినపాక ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు అహర్నిషులుగా కృషి చేస్తున్నారని కొనియాడారు.

పంచాయతీ పరిధి గ్రామాలలోని ప్రజలు మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బతుకమ్మ చీరలతో పంచాయతీలోని మహిళలు గడపగడపకు తిరిగి మహిళల ఓటర్లను ఆకర్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసెల్ మండల అధ్యక్షులు నులకతాటి శ్రీను, కర్కపల్లి సుధాకర్, బుర్ర వెంకన్న, వార్డు సభ్యులు సుమన్, కోడం సత్యం, చిరునోముల శ్రీనివాస్, అజ్జూ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply