కాంగ్రెస్ గెలుపు లక్ష్యంగా..
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ నవీన్ యాదవ్ ఘన విజయం సాధించేందుకు కీలకమైన కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నేడు గాంధీ భవన్‌లో జరిగింది. కమిటీ చైర్ పర్సన్ హైదరాబాద్ మేయర్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి, చైర్ పర్సన్ మాజీ ఎమ్మెల్యే శ్రీ ఈరవత్రి అనిల్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 7 డివిజన్ల ఇంఛార్జిలు, చైర్మన్‌లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు అందరూ ఏకమై “నవీన్ యాదవ్ గెలుపు – కాంగ్రెస్ గెలుపు” అనే ఏకైక లక్ష్యంతో కట్టుబడి పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.
మేయర్ శ్రీమతి విజయలక్ష్మి మాట్లాడుతూ.. “జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ పై అపారమైన నమ్మకం ఉంచారు. ఈ నమ్మకాన్ని కాపాడుకుంటూ, ప్రతి డివిజన్‌లో సమన్వయంతో పని చేసి, నవీన్ యాదవ్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నదే మా సంకల్పం” అని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే శ్రీ అనిల్ మాట్లాడుతూ.. “ప్రతి కార్యకర్తా, నాయకుడు ఒక్కొక్కరు ఒక్కో డివిజన్‌లో బూత్ లెవెల్ వరకు చురుకుగా పని చేయాలి. ఐక్యత, సమన్వయం, క్రమశిక్షణ.. ఇవే మన విజయ సూత్రాలు” అని పిలుపునిచ్చారు.

