Congress | ఫలించని టీపీసీసీ బుజ్జగింపులు

Congress | ఫలించని టీపీసీసీ బుజ్జగింపులు

Congress | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు మళ్లీ బయటపడుతున్నాయి. సీనియర్ నేత జీవన్ రెడ్డి రాజీనామా నిర్ణయం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. రాజీనామా నిర్ణయంపై వెనక్కి తగ్గేదేలేదని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ చేసిన బుజ్జగింపులు ఫలించలేదని వెల్లడించారు.

తాను ఎలాంటి డిమాండ్లను పీసీసీ ముందుంచలేదని, తన సమస్యకు అధిష్ఠానం వద్ద పరిష్కారం లేదని ఆయన తెలిపారు. పార్టీ మారొద్దని పీసీసీ చీఫ్ కోరినప్పటికీ, ఎలాంటి హామీ ఇవ్వలేదని పేర్కొన్నారు. నాలుగు దశాబ్దాల అనుబంధాన్ని వదులుకోవడం బాధాకరమైనదే అయినా, పరిస్థితుల కారణంగా తప్పడం లేదని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Leave a Reply