Congress | భీంగల్ లో కొనసాగిన కాంగ్రెస్ హావా..

Congress | భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ : భీంగల్ మున్సిపల్ రెండో విడుత సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగింది. ఉదయం 8 గంటలకు ప్రారంభం అయిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ మధ్యాహ్నం 11 వరకు సాగింది. కాంగ్రెస్ పార్టీ 1 వార్డు ఆరెపల్లి శ్రీజ, రెండో వార్డు పర్శ కుశలత, మూడో వార్డు తోట సతీష్, 6 వ వార్డు బోదిరే నాగమణి, ఎడో వార్డు అంజుమ్ అలీ, ఎనిమిది సందీప్, పది సంటి లత, 11 సంగ్యా నాయక్ గెలుపొందారు. బీఆర్ఎస్ నుండి 4 వ వార్డు గున్నాల లక్ష్మి, ఐదో వార్డు బోదిరే లావణ్య, తొమ్మిదో వార్డు నీలం రవి, 12 వ వార్డు మల్లెల అనుపమ విజయం సాధించినట్టు అధికారులు తెలిపారు.
