congress l కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం

congress l కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం
16వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి సాధనబోయిన క్రిష్ణ లావణ్య
congress l చెన్నూర్ , ఆంధ్రప్రభ ; రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి అండదండలతో వార్డులో నూతన సిసి రోడ్లు, తాగునిటీ సౌకర్యం, విద్యుత్దీపాలు, సైడ్డ్రైనేజి వ్యవస్థలను మెరుగు పరుస్తానని 16వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి సాధనబోయిన కృష్ణ లావణ్య అన్నారు. తన నాయకత్వాన్ని బలపరుస్తూ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటువేసి గెలిపించాలని కోరుతూ వార్డులో గడప గడపకు ప్రచారం నిర్వహిస్తూ ఇదే వార్డులో ఉంటు ప్రజలకు సేవచేసఅవకాశాన్ని ఇవ్వాలని వేడుకున్నారు.నిరుపేద బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అందెంచే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క కుటుంబానికి అందేలా సేవలు చేస్తానన్నారు. ప్రజలు తమ అమూల్యమైన ఓటును చేతి గుర్తు పై వేసి గెలిపించి వార్డు అభివృద్ధికి తోడ్పాడాలని కోరారు.
