శ్రీకాకుళంలో కలవరం

శ్రీకాకుళంలో కలవరం

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : శ్రీకాకుళం(Srikakulam) మండలం లోని దూసి గ్రామంలో ఓ రైతు నాగావళిలో గల్లంతయ్యాడు. పొలంలో యూరియా(Urea) జల్లి ,, చేతులు శుభ్రం చేసుకునేందుకు నదిలో దిగిన తరుణంలో ప్రమాదవశాత్తు కొట్టుకుపోయాడు. ఈ దుర్ఘటన కలకలం రేపింది. దూసి గ్రామానికి చెందిన కోకేరాల నారాయుడు(Kokerala Narayudu)(64) అనే రైతే శనివారం ఉదయం తన పొలంలో యూరియా జల్లి నాగావళి(Nagavali) నది గట్టు దగ్గర కాళ్ళు చేతులు కడుగుకోవటానికి వెళ్లాడు.

ప్రమాదవశాత్తు జారి పడిపోయారు. కాపాడండి అని ఆ రైతు కేకలు వేయడంతో స్థానికులు ఈ సమాచారాన్ని గ్రామస్తులకు తెలిపారు. అతని కోసం గాలింపు చేపట్టారు. ఇంత వరకు రైతు ఆచూకీ లభించలేదు. అతడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Leave a Reply