Warangal | ఏపీఎంల బదిలీల్లో గందరగోళం.. సీనియారిటీ కాదని బదిలీ

  • అందరి ముందే అవమానించారని కన్నీరు
  • రాజకీయ బలమే అని పలువురి ఆరోపణ
  • ⁠సీనియర్లను పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్


ఆంధ్రప్రభ ప్రతినిధి, వరంగల్ : వరంగల్ (Warangal) జిల్లాలో పనిచేస్తున్న వివిధ మండలాల ఏపీఎంల (APMs) బదిలీల కౌన్సిలింగ్ (Transfer Counseling) డీఆర్డీఏ కార్యాలయంలో జరిగింది. ఈ కౌన్సిలింగ్ జిల్లా అధికారి ఛాంబర్ (District Officer Chamber) లో జరగగా ఒకింత గంద‌రగోళం చోటుచేసుకుంది. సీనియారిటీ లిస్ట్ ను పరిగణలోకి తీసుకోకుండా బదిలీలు చేశారని ఒకరు.. తమను అందరి ముందే అవమానించారని ఒకరు.. కంటతడి పెట్టారు. రాజకీయ బలం ఉన్నవారికి కార్యాలయ అధికారికి అనుయాయులుగా ఉన్నవారికి కోరుకున్న చోట కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదాహరణకు ఓ అధికారికి కార్యాలయంలో కావాల్సి ఉండగా.. నీకు టైపింగ్ వచ్చా అని అన్నట్లు సమాచారం.

Leave a Reply