ఆడిట్ జరపండి.. కర్నూలు జేసీ డా.బీ.నవ్య
కర్నూలు ప్రతినిధి, ఆంధ్రప్రభ : ప్రజల అర్జీలను గడువులోపు నాణ్యతగా పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్(Joint Collector) డాక్టర్ .బి.నవ్య అధికారులను ఆదేశించారు. కర్నూలు కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసెల్ సిస్టమ్ – పీజీఆర్ఎస్) కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ప్రజల నుంచి వినతులను(Vinatulanu) స్వీకరించారు.
అనంతరం జాయింట్ కలెక్టర్ ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులతో సమీక్షించారు. పీజీఆర్ఎస్(PGRS)లో వచ్చిన దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్(Joint Collector) అధికారులను ఆదేశించారు.
పీజీఆర్ఎస్ లాగిన్ లో పరిష్కారం(Solution) చేసిన అర్జీలను ఆడిట్ చేయాలన్నారు. అర్జీల ఆడిట్ పెండింగ్ లేకుండా చూసుకోవాలన్నారు. పీజీఆర్ఎస్ లాగిన్ లోని అర్జీలను పెండింగ్ లో లేకుండా ఎప్పటికపుడు చూడాలన్నారు.
సీఎంఓ గ్రీవెన్స్ ల(CMO Grievances)కు సంబంధించి ఆదోని సబ్ కలెక్టర్(Sub Collector) వద్ద 9, కర్నూలు ఆర్డీఓ వద్ద 8, పత్తికొండ ఆర్డీఓ వద్ద 5, కలెక్టరేట్ ఏవో వద్ద 3, సర్వే ఏడి, ఏపీఐఐసీ జెడ్ఎంల వద్ద ఒక్కొక్క దరఖాస్తు చొప్పున పెండింగ్ లోని అర్జీలను బియాండ్(Beyond) ఎస్ఎల్ఎ వెళ్లకుండా పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ సి.వెంకట నారాయణమ్మ, హౌసింగ్ పీడి చిరంజీవి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనురాధ పాల్గొన్నారు.

