Condolence | వ‌న‌జీవి రామ‌య్య మృతికి ప్ర‌ధాని మోడీ సంతాపం

న్యూ ఢిల్లీ – వ‌న‌జీవి (దరిపల్లి ) రామయ్య మృతి ప‌ట్ల ప్ర‌ధాని మోడీ సంతాపం ప్ర‌క‌టించారు.. ఈ మేర‌కు ఆయ‌న త‌న అధికార ఎక్స్ ఖాతాలో తెలుగులో సంతాపం సందేశం పోస్ట్ చేశారు.. సుస్థిరత కోసం గళం వినిపించిన వ్యక్తిగా రామ‌య్య గుర్తుండిపోతార‌ని ప్ర‌ధాని పేర్కొన్నారు. లక్షలాది చెట్లను నాటడానికి, వాటిని రక్షించడానికి ఆయన తన జీవితాన్ని అంకితమిచ్చార‌ని ప్ర‌శంసించారు. ఆయన అవిశ్రాంత కృషి ప్రకృతి పట్ల ప్రేమనూ,భవిష్యత్తు తరాల పట్ల బాధ్యతను ప్రతిబింబిస్తాయ‌న్నారు. ఆయన చేసిన కృషి మన యువతలో, మరింత సుస్థిరమైన హరిత గ్రహాన్ని నిర్మించాలనే తపనను ప్రేరేపిస్తూనే ఉంటుంద‌న్నారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు,అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాన‌ని మోడీ పేర్కొన్నారు..

https://twitter.com/narendramodi/status/1910964157194584204

Leave a Reply