Conditions | చెక్‌పోస్ట్, కేబీఆర్ పార్క్ వద్ద ఇబ్బందులు

Conditions | చెక్‌పోస్ట్, కేబీఆర్ పార్క్ వద్ద ఇబ్బందులు

Conditions | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : న‌గ‌రంలోని కేబీఆర్ పార్క్, జూబ్లీచెక్ పోస్ట్ వద్ద ట్రాఫిక్‌ను పోలీసులు మళ్లించారు. స్టీల్ పైవంతెన, అండర్‌పాస్ పనుల కోస‌మ‌ని ఇవాల ప్ర‌యోగాత్త‌కంగా వ‌న్‌వే విధానం అమ‌లు చేస్తున్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయి. పంజాగుట్ట నుంచి మాదాపూర్ వెళ్లే వాహనాలను రోడ్ నం.2 వైపు మళ్లిస్తున్నారు. రోడ్ నం.45 నుంచి వచ్చే వాహనాలు చెక్‌పోస్ట్, కేబీఆర్ పార్క్ మీదుగా పంపిస్తున్నారు. దీంతో వాహ‌నాలు ఎటు వెళ్లాలో తెలియ‌క తిక‌మ‌క ప‌డుతున్నారు. గ‌మ్య స్థానాల‌కు చేరుకోవ‌డానికి చుట్టూ తిరిగి వెళ్లాల్సి వ‌స్తుంది. దీంతో వాహ‌న‌దారులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు.

Leave a Reply