Competitions | గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలి…

Competitions | గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలి…
- పోటీలను ప్రారంభించిన ముధోల్ సర్పంచ్ షబానా ఇజాజుద్దీన్
Competitions | ముధోల్, ఆంధ్రప్రభ : గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను గుర్తించేందుకు ప్రభుత్వం ప్రతి ఏటా క్రీడా పోటీలు నిర్వహిస్తూ ప్రోత్సహించాలని ముధోల్ సర్పంచ్ షబానా ఇజాజుద్దీన్ పేర్కొన్నారు. ఈ రోజు మండల కేంద్రంలో సీఎం కప్ క్రీడాలను ముధోల్ సర్పంచ్ షబానా ఇజాజుద్దీన్ ప్రారంభించారు. అనంతరం సర్పంచ్ షబానా ఇజాజుద్దీన్ మాట్లాడుతూ… చదువుతోపాటు క్రీడల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు గ్రామస్థాయిలోని క్రీడా పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మండల స్థాయిలోని క్లస్టర్ పరిధిలో క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ముధోల్ క్లస్టర్ పరిధిలోని వివిధ పాఠశాలలో వివిధ రకాల క్రీడా పోటీలను ప్రారంభించారు. క్రీడల పట్ల యువకులు ఆసక్తి చూపాలని, క్రీడలు యువతకు ఎంతో ఉపయోగపడతాయని, ప్రతి ఒక్కరు క్రీడలను అలపర్చుకొని ముందుకు నడవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి రమణరెడ్డి, ఉప సర్పంచ్ కోరి లావణ్య సాయినాథ్, పిడీలు మచ్చగిరి శ్రీనివాస్,పీటీలు, క్రీడాకారులు, వివిధ మండలాల పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీ సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
