విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి…

విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి…

మంథని, ఆంధ్ర‌ప్ర‌భ : విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని పెద్దపెల్లి జిల్లా సాంఘిక సంక్షేమ గురుకులాల సమన్వయ అధికారి, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాల (బాలురు) ప్రిన్సిపాల్ శ్రీనాథ్ పేర్కొన్నారు. మంగళవారం మంథని పట్టణం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ప్రిన్సిపాల్ శ్రీనాథ్ అభినందించారు. పి ఎం శ్రీ పెద్దపల్లి జిల్లా స్థాయి ఆటల పోటీలు ఇటీవలే సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించారు.

ఈ ఆటల పోటీలలో మంథని గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులు కబడ్డీ , ఖో ఖో విభాగంలో ప్రథమ బహుమతి, వాలీబాల్ విభాగంలో ద్వితీయ బహుమతి, అథ్లెటిక్స్ 100 మీటర్ల పరుగు పందెంలో తరుణ్ ప్రథమ బహుమతి సాధించాడు. లాంగ్ జంప్ విభాగంలో నవదీప్ ద్వితీయ బహుమతి, మనోహర్ తృతీయ బహుమతులు కైవసం చేసుకున్నారు. షాట్ పుట్ విభాగంలో మనోహర్ ద్వితీయ బహుమతి గెలుచుకున్నారు. క్రీడలలో అద్భుతంగా రాణించిన విద్యార్థులు ఉద్దేశించి ప్రిన్సిపాల్ శ్రీనాథ్ మాట్లాడుతూ…. విద్యార్థులు విద్యార్థి దశలోనే చదువుతోపాటు ఆటలలో నైపుణ్యం సాధించాలని పేర్కొన్నారు.

ప్రతి ఒక్క విద్యార్థి ప్రత్యేకమైన నైపుణ్యం ఉంటుందని, దానిని విద్యార్థి దశలోనే గుర్తించాలని సూచించారు. క్రీడలలో రాణించి దేశానికి మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. మునుముందు జరిగే క్రీడలలో అద్భుతంగా రాణించాలని పేర్కొన్నారు. విద్యార్థులు క్రీడలలో చూపిన ప్రతిభకు కారణమైన పిడి రమేష్, పిఈటి పుష్పలతను అభినందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ వైస్ ప్రిన్సిపల్ నవీన్, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ రవి, పాఠశాల/ కళాశాల బోధన, బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply