competition | గ్రామాభివృద్ధికి సేవకుడిలా పనిచేస్తా:
competition | నల్లబెల్లి, ఆంధ్రప్రభ : రేలకుంట గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు గ్రామ ప్రజలు కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉండి సేవకుడిలా పనిచేస్తానని బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి రసపుత్ర రజిత రవీందర్ అన్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి మాట్లాడుతూ.. గ్రామ ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుని ప్రజలకు(people) ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవ చేయడం తన లక్ష్యమని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బానోతు సారంగపాణి సూచనలతో పార్టీ తరఫున రసపుత్ర రజిత రవీందర్ సర్పంచ్ అభ్యర్థిగా వెల్లడించారు.
గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో సర్పంచ్ పదవికి పోటీ(competition) చేయడం జరిగింది అన్నారు. “గ్రామ ప్రజల అధికారుల మద్దతుతో రేలకుంట గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాన”ని రసపుత్ర రజిత రవీందర్ అన్నారు.

