Competition | ఉట్నూర్ పట్టణ ఓటర్ల విలక్షణ తీర్పు

Competition | ఉట్నూర్ పట్టణ ఓటర్ల విలక్షణ తీర్పు

ఉట్నూర్ మేజర్ సర్పంచ్ అనిత జాదవ్ కు పట్టం

Competition | ఉట్నూర్, ఆంధ్రప్రభ : మండలంలో తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు గురువారం జరగగా ఈసారి జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మండలంలోని 31 గ్రామపంచాయతీల సర్పంచ్ పదవికి ఎన్నికలు జరిగాయి. ఉట్నూర్ పట్టణంలో ఓటర్లు ఎవరికి అంతుపట్టని, ఊహించని విలక్షణ తీర్పు ఇచ్చారు. ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పదవికి 15మంది పోటీలో ఉండగా, ఉట్నూర్ పట్టణ ప్రజలు అధికార పార్టీ నుండి బలపరిచిన అభ్యర్థులకు తిరస్కరించి స్వాతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన అనిత జాదవ్ కు 440 ఓట్లపై మెజార్టీ ఇచ్చి విలక్ష‌ణ‌ తీర్పు ఇచ్చారు.

Competition

గురువారం రాత్రి 8 గంటల నుండి ఉట్నూర్, లక్కారం సర్పంచ్ పదవి ఓట్ల లెక్కింపు రాత్రి 9 గంటల నుండి ప్రారంభమై ఈరోజు శుక్రవారం ఉదయం తెల్లవారుజామున ఒకటిన్నర 30 నిమిషాల వరకు కొనసాగింది. ఆ తర్వాతనే అధికారులు గెలుపు పొందిన ఉట్నూర్ మేజర్ గ్రామ పంచాయతీ, లక్కారం సర్పంచ్ పదవి గెలుపు ఫలితాలు ప్రకటించారు. ఈ ఫలితాల్లో ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీ పదవికి అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరు మంది అభ్యర్థులు బరిలో దిగారు. బిజెపి నుండి ఇద్దరు అభ్యర్థులు టిఆర్ఎస్ నుండి ఇద్దరు అభ్యర్థులు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పదవికి బలిలో దిగారు.

కానీ ఈ ఎన్నికల్లో ఉట్నూర్ లక్కారం పంచాయతీల ఓటర్లు ఊహించని రీతిలో ప్రధాన పార్టీలు బలపరిచిన అభ్యర్థులను ప్రజలు ధిక్కరించి ఉట్నూర్ లక్కారంలో బీఆర్ఎస్ పార్టీ నుండి బలపరిచిన అభ్యర్థి అజ్మీర్ రేణుకకు 131 ఓట్ల మెజార్టీకి పట్టం కట్టారు. ఉట్నూర్ లో లక్కారంలో అధికార పార్టీ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు మిశ్రమ భాగ్యలక్ష్మి నర్సుల సరస్వతిని గెలిపించాలని ఎమ్మెల్యే ప్రచారం చేసి పది వాగ్దానాలు చేసినా ప్రజలు ధిక్కరించారు. ఎవరూ ఊహించని రీతిలో విలక్షణంగా ఉట్నూర్ లక్కారం ప్రజలు పంచాయితీ ఎన్నికల్లో తీర్పుని ఇవ్వడంతో చర్చనీయాంశంగా మారింది. ఉట్నూర్ ప్రజల తీర్పు పట్ల ఓటమిపాలైన అధికార పార్టీ నాయకులు ఓటమికి గల కారణాలు విశ్లేషించుకుంటున్నారు.

Leave a Reply