Competition | తారుపల్లి లో ముమ్మర ప్రచారం
Competition | కాల్వ శ్రీరాంపూర్, ఆంధ్రప్రభ : తారుపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి జనవేన స్వరూప సదయ్య ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ (Congress) బలపర్చిన అభ్యర్థి జనవే స్వరూప సదయ్య సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నారు. ఈ రోజు స్వరూప సదయ్య గ్రామస్తులతో కలిసి వాడ వాడల తిరుగుతూ తనకు ఓటేసి గెలిపించాలని కోరుతున్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే వి. జయరమణారావు సహకారంతో గ్రామానికి అత్యధిక నిధులు తీసుకు వస్తానని హామీ ఇస్తున్నారు. గ్రామంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేసి ఉత్తమ గ్రామ పంచాయతీగా తారుపల్లిని గ్రామాన్ని తీర్చిదిద్దుతానని చెబుతున్నారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని భరోసా కల్పిస్తూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు.

