బాసర , ఆంధ్ర ప్రభ : ఇటీవలే కురిసిన వర్షాలు (Rains), వరదలకు దెబ్బతిన్న పంటలు సాగు చేసిన కౌలు రైతులకు (For tenant farmers) నష్ట పరిహారం అందించాలని కోరుతూ భారతీయ కిసాన్ సంఘ్ (Bharatiya Kisan Sangh) డిమాండ్ చేసింది. ఈ రోజు తహసీల్దార్ పవనచంద్రకు వినతి పత్రం అందజేశారు.
భారతీయ కిసాన్ సంఘ్ అధ్యక్షుడు గంగారావు మాట్లాడుతూ.. మండల పరిధిలో గత వారం వరదలతో వేల ఎకరాల్లో పంట నష్టపోయిన కౌలు రైతులను ఆదుకోవాలని కోరారు. నిజమైన కౌలు రైతుల ను గుర్తించి వ్యవసాయ శాఖ (Agriculture Department) ద్వారా సర్వే (Survey) చేయించి ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మమ్మాయి గంగాధర్, ఆనంద్ బండారి, బిద్దురు రమేష్, శివాజి పటేల్, పిల్లి కండ్లోడ్ సాయినాథ్, అజ్గర్,తదితరులు పాల్గొన్నారు.