సరుకులు పంపిణీ
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : మొంథా తుఫాన్ ప్రభావం వల్ల నష్టపోయిన మత్యకార కుటుంబాలను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని శ్రీకాకుళం నియోజకవర్గ(Srikakulam Constituency) మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ తెలిపారు. ప్రభుత్వం తక్షణ సహాయం నిమిత్తం అందజేసిన నిత్యావసర సరుకులను మండలం బలరాంపురం మత్స్యకార కుటుంబాలకు 50 చెప్పున రేషన్ బియ్యం ఈ రోజు ఆమె అందజేశారు. కేజీల బియ్యం, కేజీ ఆయిలు, కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళదుంపలు(Commodity Distribution, Onions, Potatoes), పంచదార ఒంటి నిత్యవసర సరుకులను కూడా పంపిణీ చేశారు.
ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని అందరికీ అందజేయాలని అధికారులకు చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, లబ్ధిదారులు, సచివాలయాల సిబ్బంది పాల్గొన్నారు.

