వ్యక్తి ఆత్మహత్య..

వ్యక్తి ఆత్మహత్య..

దండేపల్లి, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా, దండేపల్లి మండలంలోని గూడెం గోదావరి నదిలో దూకి హజీపూర్ మండలం కర్ణమామిడి గ్రామానికి చెందినగోళ్ల రవీందర్(Ravinder, the owner of the house)(35)గోదావరి నదిలో దూకి మృతి చెందినట్లు దండేపల్లి ఎస్సై తహసినోద్దీన్, కుటుంబ సభ్యులు తెలిపారు, వారు తెలిసిన వివరాల ప్రకారం, మృతుడు రవీందర్ కు గత కొంతకాలంగా ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో ఎప్పుడు భార్య సుమలతతో బ్రతకాలి అనిపించడం లేదని అనేవాడు.

ఈ రోజు ఉదయం మృతుని భార్య సుమలత(wife Sumalatha.) కూరగాయలు అమ్మడానికి వెళ్లడంతో, ఇంట్లో ఎవరు లేకపోవడంతో మృతుడు తన మోటార్ సైకిల్ నం టిఎస్19 0383పై దండేపల్లి మండలం గూడెం గోదావరిలో దూకి మృతి చెందాడు. మృతునికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుని భార్య సుమలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Leave a Reply