వర్షాల వల్ల కలిగే సమస్యలను పరిష్కరిస్తాం…

వర్షాల వల్ల కలిగే సమస్యలను పరిష్కరిస్తాం…
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ కార్పొరేషన్, ఆంధ్రప్రభ : మాన్సూన్ రెస్పాన్స్ టీం తో వర్షాల వల్ల కలిగే సమస్యలను పరిష్కరిస్తున్నాం అని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. బుధవారం సాయంత్రం పిన్నమనేని పాలీ క్లినిక్ రోడ్, నిర్మలా కాన్వెంట్ రోడ్, జమ్మిచెట్టు సెంటర్, ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ టెలి కాన్ఫరెన్స్ లో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మన్సూన్ రెస్పాన్స్ టీం, మళ్లీ తమ తమ విధుల్లో వెంటనే హాజరు కావాలని, వర్షాలు కురిసినప్పుడు ఎక్కడైతే రోడ్లపై నీటి నిల్వలు ఉంటాయో అక్కడ రోడ్డు పైన నిల్వ ఉండకుండా చర్యలు తీసుకునేటట్టు వాహనాలు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని అన్నారు.
నగరంలోని పునరావస కేంద్రాలను అన్ని వసతులతో పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలని అన్నారు. ముఖ్యంగా జమ్మి చెట్టు సెంటర్, పిన్నమనేని పాలీ క్లినిక్ రోడ్, డి.వి మేనర్ రోడ్ లో ప్రత్యేక దృష్టి వహించాలని, వర్షం కురిసినప్పుడు తరచుగా అక్కడ నీటి నిలువలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, డిసిల్టింగ్ ముందుగానే చేయించుకున్నప్పటికీ ఈ మధ్యకాలంలో ఏమన్నా వ్యర్ధాలు పేరుకుపోయాయేమో ఒకసారి గమనించి, వెంటనే వాటిని తొలగించాలని అధికారులను ఆదేశించారు.
జోనల్ కమిషనర్లు అధికారులు తమ తమ పరిధిలో గల పాయింట్స్ ని దృష్టిలో పెట్టుకొని, ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ, క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ, ఎటువంటి సమస్యలు ఎత్తనివ్వకుండా చూసుకోవాలని కమిషనర్ అన్నారు. నగర పరిధిలో ఎక్కడెక్కడ వర్షం నిల్వలు ఉండే అవకాశాలు ఉన్నాయో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లతో ఎప్పటికప్పుడు వాకి టాకీ లోబటి స్థితిగతులను కనుక్కుంటూ ప్రజలకు ఎటువంటి సమస్య లేకుండా నిరంతర పర్యవేక్షణతో కమిషనర్ పరిశీలించారు. ఈ పర్యటనలు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సామ్రాజ్యం సిబ్బంది పాల్గొన్నారు.
