వేణుగోపాల స్వామి ఆదాయం రూ.15,17,776…

వేణుగోపాల స్వామి ఆదాయం రూ.15,17,776…

గంపలగూడెం, ఆంధ్రప్రభ : జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న మండలంలోని నెమలి స్వయంభూ శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో 11/02/2026 నుండి 25/03/2026 వరకు భక్తులు సమర్పించిన హుండీ కానుకలను బుధవారం లెక్కించగా 15,17,776 రూపాయలు లభించినట్లు ఆలయ సహాయ కమీషనర్ నేల సంధ్య తెలిపారు.

అదేవిధంగా వెండి 129 గ్రాములు, 10 ఆస్ట్రేలియా డాలర్లు లభించినట్లు వెల్లడించారు. లెక్కింపును జిల్లా దేవాదాయ శాఖ అధికారి ఎమ్.షణ్ముఖం పర్యవేక్షించారు. కార్యక్రమంలో మాజీ ట్రస్టు బోర్డు సభ్యుడు వనమా చిన్న అనంత రామయ్య,పామర్తి కొండలరావు,సత్యసాయి సేవా సమితి సభ్యులు,గ్రామ ప్రజలు,ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply