భారీ వర్షాలు.. హాలిడే ప్రకటించాలి..

పరిగి, ఆగస్టు 14 ( ఆంధ్రప్రభ ) : భారీవర్షాల కారణంగా విద్యార్థుల భద్రతా దృష్ట్యా జిల్లాలోని ఇంటర్ కాలేజీలకు (inter colleges) సెలవులు ప్రకటించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. జిల్లాలో భారీ వర్షాలు (HeavyRains) కురుస్తున్నందున ఇప్పటికే ప్రభుత్వం రెడ్ అలర్ట్ (RedAlert) ప్రకటించింది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రోడ్లు, ఇతర ప్రయాణ మార్గాల్లో వాగులు ప్రవహిస్తూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

రోడ్లు, ఇతర ప్రయాణం మార్గాల్లో నీరు నిలిచి ప్రవహిస్తుండడంతో కాలేజీలు విద్యార్థులకు, సిబ్బందికి రాకపోకలు కష్టంగా మారాయి. ఇప్పటికే పాఠశాలల విద్యార్థులకు రెండు రోజులపాటు జిల్లా విద్యాశాఖ (Education Department) సెలవులు ప్రకటించింది. విద్యార్థుల భద్రతా దృష్ట్యా ఇంటర్ కాలేజీలకు కూడా సెలవులు ప్రకటించాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంటర్ కాలేజీల విషయంలో కూడా ఉన్నత విద్యాశాఖ సెలవులు ప్రకటించాల్సిన అవసరం ఉంది.

Leave a Reply