College | లక్ష్యంతో ముందుకు సాగితేనే విజయం సిద్ధిస్తుంది

College | లక్ష్యంతో ముందుకు సాగితేనే విజయం సిద్ధిస్తుంది
College | మోత్కూరు, ఆంధ్రప్రభ : విద్యార్థి దశలోనే ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగితేనే విజయం సిద్ధిస్తుందని మోత్కూరు ఎస్ హెచ్ ఓ, ఇన్స్పెక్టర్ సి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ రోజు ప్రభుత్వ జూనియర్ కళాశాల మోత్కూరులో సైబర్ నేరాలు, మత్తు పదార్థాల వల్ల అనర్ధాలు, మహిళల భద్రత తదితర విషయాలపై అవగాహన కల్పించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విద్యార్థి దశలో ఇంటర్మీడియట్ కీలకమైందని అన్నారు. ఉత్తమ క్రమశిక్షణతో ముందుకు సాగితే జీవితంలో అపజయం అనేది ఉండదన్నారు.
అనునాతనమైన సాంకేతిక పరిజ్ఞానం జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఉపయోగించుకోవాలని, పుస్తక పఠనంతోనే మానసిక వికాసం సిద్ధిస్తుందన్నారు. సైబర్ నేరాల పట్ల తాము అవగాహన పెంచుకోవడంతో పాటు ఇరుగు, పొరుగు వారిని చైతన్యం చేయాలని కోరారు. ఇన్చార్జి ప్రిన్సిపాల్ ఎం. పరశురాములు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ కే నరసింహారెడ్డి స్టూడెంట్ కౌన్సిలర్ సిహెచ్ లింగస్వామి, యాంటీ డ్రగ్స్ కమిటీ కన్వీనర్ సిహెచ్ అంజయ్య, లెక్చరర్లు పి ఈశ్వరరావు, ఏఎస్ఐ వెంకన్న వెంకన్న, హెడ్ కానిస్టేబుల్ నరసింహ తదితరులు పాల్గొన్నారు.
